Coronavirus: దేశంలో మరోసారి కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య రెండున్నర లక్షల మార్కుదాటేసింది. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అదే విధంగా వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాయి. ఇప్పటికే ఈ నెల 3 నుచి దేశంలో 15-18 ఏళ్ల వారికి టీకా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోని విద్యార్థులను స్కూళ్లకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులు ఉండగా తిరిగి ప్రారంభమయ్యే సమయానికి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెల్లిపారు. రాష్ట్రంలో ఉన్న పిల్లలంతా టీకాలు తీసుకునేలా ప్రోత్సాహించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మరి హరియాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాల వారు కూడా అమలు చేస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే థార్డ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను పొడగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కరోనా థార్డ్‌వేవ్‌లో ఎక్కువగా చిన్నారులే కరోనా బారిన పడుతుండడంతో ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయి.
China Manja: పండుగపూట విషాదం.. మరో ప్రాణం తీసిన చైనా మాంజ.. బైక్‌పై వస్తుండగా
Big C Offers: స్మార్ట్‌టీవీలు, మొబైళ్లపై బిగ్ సి అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్