కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు సామాన్య ప్రజలనే తాకిన ఈ మహమ్మారి.. ఇప్పుడు రాజకీయ నాయకులను, జర్నలిస్టులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీ గంగాధర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. శుక్రవారం, శనివారం నాడు ఆయన మంత్రి ఈటల రాజేందర్ వెంటే తిరిగినట్లు సమాచారం. దీంతో ఆయన వెంట ఉన్న వారంతా షాక్‌కు గురవుతున్నారు. ఇదిలావుంటే. ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.