తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి కరోనా సోకింది. గత కొద్ది రోజుల క్రితమే ఆయన గన్‌మెన్లకు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మహమూద్ అలీకి కూడా కరోనా పరీక్షలు చేయగా.. రిపోర్ట్స్‌లో పాజిటివ్ తేలింది. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా, తెలంగాణలో కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఏడు వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు తేలుతున్నాయి.