విద్యార్థులను నేరుగా పై తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం

| Edited By:

May 05, 2020 | 5:26 PM

ఒకటి నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులను తదుపరి తరగతికి ప్రమోట్ చేసింది ప్రభుత్వం. పరీక్షలు లేకుండానే పై తరగతులకు నేరుగా ప్రమోట్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం..

విద్యార్థులను నేరుగా పై తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం
Follow us on

ఒకటి నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులను తదుపరి తరగతికి ప్రమోట్ చేసింది ప్రభుత్వం. పరీక్షలు లేకుండానే పై తరగతులకు నేరుగా ప్రమోట్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. ఇప్పటికే తరగతుల పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1085 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 29 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటివరకూ మొత్తం 585 మంది కరోనాతో కోలుకుని ఇంటికి వెళ్లగా.. ప్రస్తుతం తెలంగాణలో 471 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా జీహెచ్ఎంసీ మినహా ఇతర అన్ని జిల్లాల్లో కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

Read More:

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో మొదలైన కలవరం!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!