Telangana Corona Cases: తెలంగాణలో దిగివస్తునన కరోనా కేసులు.. కొత్తగా 325మందికి పాజిటివ్

తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 325 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

Telangana Corona Cases: తెలంగాణలో దిగివస్తునన కరోనా కేసులు.. కొత్తగా 325మందికి పాజిటివ్
corona

Updated on: Aug 28, 2021 | 7:28 PM

Telangana Corona Cases: తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 78,787 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 325 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,869కు చేరింది. గడిచిన 24 గంటల్లో 424 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 6 లక్షల57 వేల119 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 6,065 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,44,26,002 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

ఇక, జిల్లాల వారీగా ఇవాళ నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి….

Read Also…  

Farmer found Diamond: పంట పండించకుండానే రాత్రికి రాత్రే లక్షాధికారి అవుతున్న రైతు.. ఆరోసారి వరించిన అదృష్టం!

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో 200పైగా కేసులు నమోదు..!