రాష్ట్రంలో కలవరపెడుతున్న కరోనా వైరస్.. కొత్తగా 142 మందికి కోవిడ్ పాజిటివ్, ఇద్దరు మృతి

|

Mar 09, 2021 | 11:09 AM

దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతుంది.

రాష్ట్రంలో కలవరపెడుతున్న కరోనా వైరస్.. కొత్తగా 142 మందికి కోవిడ్ పాజిటివ్, ఇద్దరు మృతి
Follow us on

Telangana corona : దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతుంది. రాష్ట్రంో పెరుగుదల ఎక్కువగా లేకపోయినప్పటికీ.. మిగిలిన రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుతుండటంతో ఇక్కడ కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది.

తెలంగాణలో మొన్న కొత్తగా 158 కేసులు నమోదు కాగా, నిన్న 111 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక, ఆదివారం రాత్రి 8గంటల నుంచి సోమవారం రాత్రి 8గంటలవరకు 19,929 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 142 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,00,153కి చేరింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఇద్దరు మరణించడంతో.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1644కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఇక, కరోనా బారి నుంచి సోమవారం 178 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,96,740కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,769 ఉండగా.. వీరిలో 633 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 90,16,741కి చేరింది.

మరోవైపు, పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర మ‌హిళా, శిశు సంక్షేమ‌, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ క‌రోనా బారిన ప‌డ్డారు. సోమవారం ఉదయం నిర్వహించిన పరీక్షల్ల ఆమె కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఇక, ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.

Read Also…విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనల్లో ఉద్రిక్తత.. పరిపాలన భవనాన్ని ముట్టడించిన కార్మికులు.. భయంతో పరుగులు తీసిన డైరెక్టర్‌