Telangana Covid 19 Cases today updates: తెలంగాణలో కోవిడ్(COVID-19) వ్యాప్తి మరింత పెరుగుతోంది. పండుగ ముగిసిన వెంటనే కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3,877 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా(CORONA) కేసుల సంఖ్య 7,54,976 కాగా, మరణాల సంఖ్య 4,083గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 7,10,479 ఉండగా, తాజాగా 2,981 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.11 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 40,414 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇక, ఇవాళ మొత్తం 1,01,812 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,18,77830 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1189 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో మేడ్చెల్ జిల్లాలో 348 మంది, రంగారెడ్డి జిల్లాలో 241 మంది, హన్మకొండ జిల్లాలో 140, ఖమ్మం జిల్లాలో 112, నిజామాబాద్ జిల్లాలో 107 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.
ఇవి కూడా చదవండి: Viral Video: స్నేహం అంటే ఇదే రా.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన ఫ్రెండ్‌ను రక్షించిన కుక్క..
Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..