TS Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి.. గత 24 గంటల్లో..

|

Jan 26, 2022 | 8:27 PM

తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. పండుగ ముగిసిన వెంటనే కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3,801 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన...

TS Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి.. గత 24 గంటల్లో..
Follow us on

Telangana Covid 19 Cases today updates: తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. పండుగ ముగిసిన వెంటనే కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3,801 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన ఒక్క మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,47,155 కాగా, మరణాల సంఖ్య 4,078గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 7,05,054 ఉండగా, తాజాగా 2,046 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.37 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 38,023 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, ఇవాళ మొత్తం 88,867 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,16,78,469 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,570 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. తర్వత స్థానాల్లో మేడ్చెల్ జిల్లాలో 254 మంది, రంగారెడ్డి జిల్లాలో 284 మంది, హన్మకొండ జిల్లాలో 147, ఖమ్మం జిల్లాలో 139 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.

ఇవి కూడా చదవండి: Long Hair Tips: పట్టుకుచ్చుల్లా మెరిసిపోయే కురులు కావాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి..

Mudragada-Ap CM: కొత్త జిల్లాలకు వీరి పేర్లు పెట్టండి.. సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ..