Telangana Corona Cases: తెలంగాణ‌లో కొత్త‌గా 3,043 క‌రోనా పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు, యాక్టివ్ కేసుల వివ‌రాలు

|

May 24, 2021 | 9:58 PM

తెలంగాణలో కరోనా వైర‌స్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త‌గా 59,709 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 3,043 మందికి వైర‌స్ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల ...

Telangana Corona Cases: తెలంగాణ‌లో కొత్త‌గా 3,043 క‌రోనా పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు, యాక్టివ్ కేసుల వివ‌రాలు
Follow us on

తెలంగాణలో కరోనా వైర‌స్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త‌గా 59,709 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 3,043 మందికి వైర‌స్ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య5,56,320కి చేరింది. తాజాగా మరో 21 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో మొత్తం వైర‌స్ మృతుల సంఖ్య 3,146కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 39,206 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. సోమ‌వారం 4,693 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు తెలిపింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 424 మందికి పాజిటివ్‌గా తేలింది.

కొవిడ్‌ కట్టడికి ద్విముఖ వ్యూహం: కేసీఆర్‌

తెలంగాణలో కరోనా మహమ్మారి నివారణకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారుల‌కు. కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు సంబంధిత అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఫీవర్‌ సర్వే, మెడికల్‌ కిట్ల పంపిణీ వ‌ల్ల మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని, దీనిని కొనసాగించాలని అధికారులకు సూచించారు. కరోనా టెస్టుల‌ సంఖ్యను మరింతగా పెంచాలన్నారు. పీహెచ్‌సీల్లో ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని, ర్యాపిడ్‌ యాంటీ జెన్‌ టెస్టు కిట్ల సంఖ్య పెంచాలని ఆదేశించారు. మంగ‌ళ‌వారం నుంచి అన్ని వైద్య కేంద్రాల్లో కిట్ల సంఖ్యను పెంచాలని అన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు బెడ్లు, మెడిసిన్ సమకూర్చుకోవాలని తెలిపారు.

Also Read: మ‌రో సెన్సేష‌న్… కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందుపై హైకోర్టులో పిటిషన్

 ఏపీలో కొత్త‌గా 12,994 పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసుల వివ‌రాలు