
Mallu Bhatti Vikramarka: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది . ఆదివారం కూడా రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు చాలా మంది ఈ వైరస్ కాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వరుసగా కరోనా బారిన పడుతన్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తాజాగా చేయించుకున్న టెస్టుల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితిపై భట్టి విక్రమార్క ఓ లేఖను విడుదల చేశారు.
ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దని భట్టి విక్రమార్క కోరారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత తానే బయటకు వస్తానని, అందరినీ కలుస్తానని చెప్పకొచ్చారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా నిన్న (జనవరి 16)తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు . ఇక తెలంగాణలో ఆదివారం కొత్తగా 2,047 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఏకంగా 1, 174 కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు.
Also Read: Megha Akash: అందాల సోయగం.. నవ్వుల నయాగారం మేఘా ఆకాష్ సొగసులు చూడతరమా.!
Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో
Viral Video: తాబేలు చేసిన పనికి ఖంగుతున్న మొసలి.. వీడియో చూస్తే.. వీడియో