తమిళనాడులో కరోనా విలయ తాండవం.. తాజాగా మరో 4,526 కేసులు..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. రోజుకు మూడు నుంచి..

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. రోజుకు మూడు నుంచి నాలుగు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 4,526 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,324కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 47,912 యాక్టివ్ కేసులు ఉన్నాయని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 97,310 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 2,099 మంది మరణించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి.
కాగా, దేశ వ్యాప్తంగా మంగళవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9 లక్షలు మార్క్ దాటింది. వీరిలో 5.7 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారినపడి 23,727 మంది మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
4,526 people tested positive for COVID-19 and 67 patients died in Tamil Nadu today, taking total cases to 1,47,324 including 97,310 recoveries and 2,099 deaths. 41,357 samples were tested today for the disease: State Health Department pic.twitter.com/ctsFJ2Tncx
— ANI (@ANI) July 14, 2020



