కరోనా వ్యాప్తికి పసుపుతో కళ్లెం! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాధికి వ్యాక్సిన్, మందులను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు కేరళలోని కొట్టాయంలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నిపుణులు కూడా కరోనా వ్యాప్తిని..

కరోనా వ్యాప్తికి పసుపుతో కళ్లెం! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

Edited By:

Updated on: May 03, 2020 | 12:45 PM

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాధికి వ్యాక్సిన్, మందులను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు కేరళలోని కొట్టాయంలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నిపుణులు కూడా కరోనా వ్యాప్తిని నియంత్రించే పద్ధతులు, వ్యాక్సిన్ల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్నారు. పసుపులోని కర్కమిన్ అనే పదార్థం సాయంతో పీపీఈలను శుభ్రం చేసే విధానాలపై అధ్యయనం చేస్తున్నారు. వ్యాక్సిన్ తయారీపైనా దృష్టి సారించారు.

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సాబు థామస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు సాగుతున్నాయి. కరోనాను పసుపులోని కర్కమిన్ అనే పదార్థం నియంత్రించగలదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా మూడు ప్రాజెక్టులపై కృషి చేస్తున్నట్లు థామస్ పేర్కొన్నారు. కర్కమిన్, టైటానియం డైయాక్సైడ్‌తో మరిన్ని పదార్థాల మిశ్రమంతో పీపీఈలు, మాస్క్‌లకు అతి సూక్ష్మంగా పూత పూసి, తద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పరిశోధిస్తున్నారు. వీటి కోసం మూడేళ్ల సమయంతో పాటు రూ. 3 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిశోధనలన్నింటికీ జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు సహకారం అందిస్తున్నాయని డాక్టర్ సాబు థామస్ తెలిపారు.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!