వలస కార్మికుల పాలిటి నిజమైన దేవుడు సోనూసూద్‌కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ నీరాజనాలు పలుకుతున్నారు. దేశవ్యాప్తంగా వలస కార్మికులతోపాటు సినిమా, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాజాగా.. ముంబై కార్మికుల పట్ల ఔదార్యాన్ని చూపించిన సోనూసూద్‌కు ఒడిశా వాసులు పూజలు చేశారు. భువనేశ్వర్‌లోని ప్రధాన కూడలిలో సోనూసూద్‌ను “కరోనా ఫైటర్ కింగ్” అంటూ కటౌట్ ఏర్పాటు చేశారు. ఫొటో ముందు రంగులతో ముగ్గులు వేసి.. పూలతో అలకరించి పూజలు చేశారు. ఈ వీడియోపై సోనూసూద్ స్పందించారు. వారు చేస్తున్న చాలా బాగుందన్నారు. కానీ తనకు అంత అర్హత లేదని… మీ ప్రేమానురాగాలే నాకు రక్ష అంటూ రీట్వీట్ చేశాడు.
This is so sweet❣️.. but I don’t deserve this? just your love and wishes keep us alive ❤️ https://t.co/uYCos3t9Rr
— sonu sood (@SonuSood) June 15, 2020