కరోనాతో ప్రముఖ సింగర్‌ మృతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైర‌స్ బారిన ప‌డి ఇప్ప‌టికే ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు మృత్యువాత‌ప‌డ్డారు. తాజాగా ప్రముఖ సింగర్‌ ...

  • Jyothi Gadda
  • Publish Date - 10:58 am, Mon, 30 March 20
కరోనాతో ప్రముఖ సింగర్‌ మృతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైర‌స్ బారిన ప‌డి ఇప్ప‌టికే ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు మృత్యువాత‌ప‌డ్డారు. అగ్ర‌రాజ్యం అమెరికా కూడా క‌రోనా పంజా దెబ్బ‌కు విల‌విల‌లాడుతోంది. రోజురోజుకూ విజృంభిస్తూ..అమెరికాలో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తోంది. తాజాగా ప్రముఖ అమెరికన్‌ సింగర్‌ జో డిఫీని కరోనా బలితీసుకుంది.

ప్రముఖ కంట్రీ సింగర్‌, గ్రామీ అవార్డు విజేత జోయ్‌ డిఫ్పీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా మృతిచెందిన‌ట్లు అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. 61 ఏళ్ల వ‌య‌సున్న డిఫీ..1990 దశకంలో అమెరికన్‌ జానపద సంగీతాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. సంగీత ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డులుగా భావించే గ్రామీ అవార్డులు కూడా ఆయన గెలుచుకున్నారు. తనకు కోవిడ్ సోకినట్టు జో డిఫీ రెండు రోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది. పికప్ మ్యాన్, ప్రాప్ మీ ఆఫ్ బిసైడ్ ద జూక్‌బాక్స్, జాన్ డీర్ గ్రీన్ వంటి పాటలు జో డిఫీని ప్రపంచానికి పరిచయం చేశాయి.