సింగపూర్‌లో కోవిడ్ బి.1.617 స్ట్రెయిన్ కలకలం.. పిల్లలపై అత్యధిక ప్రభావం.. స్కూళ్లు మూసివేత..

|

May 18, 2021 | 5:58 AM

Singapore Warns New Virus Strains: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాలు కూడా ఈ మహమ్మారితో పోరాడుతున్నాయి. అయినప్పటికీ

సింగపూర్‌లో కోవిడ్ బి.1.617 స్ట్రెయిన్ కలకలం.. పిల్లలపై అత్యధిక ప్రభావం.. స్కూళ్లు మూసివేత..
singapore
Follow us on

Singapore Warns New Virus Strains: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాలు కూడా ఈ మహమ్మారితో పోరాడుతున్నాయి. అయినప్పటికీ కరోనా కనికరం లేకుండా విజృంభిస్తోంది. అయితే.. భారతదేశంలో కేసుల పెరుగుదలకు కారణమైన కరోనా కొత్త స్ట్రెయిన్ బి.1.617 తాజాగా సింగపూర్ లో వెలుగుచూసింది. దీంతో ఆదే తీవ్ర ఆందోళన నెలకొంది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు బీ.1.617 స్ట్రేయిన్ కారణమని పలు అధ్యయనాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదే తరహా వైరస్ ఇప్పుడు సింగపూర్‌లో కేసుల పెరుగుదలకు కారణంగా మారింది. దీని ప్రభావంతో చిన్నారులు అత్యధిక సంఖ్యలో పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నట్లు సింగపూర్ అధికారులు తెలిపారు.

సింగపూర్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం నుంచి సింగపూర్ లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మే 28తో విద్యాసంవత్సరం పూర్తి కానుండగా, అప్పటివరకు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా.. కొన్నినెలలుగా సింగపూర్‌లో పెద్దగా కేసులేమీ నమోదు కాలేదు. అయితే తాజాగా మళ్లీ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు.

ఈ మేరకు సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యే కుంగ్ మాట్లాడుతూ.. బి.1.617 స్ట్రెయిన్ పిల్లలపై అత్యధిక ప్రభావం చూపిస్తోందని తెలిపారు. జన్యు ఉత్పరివర్తనాలకు లోనైన ఈ వేరియంట్లు చిన్నారుల మధ్య వేగంగా వ్యాప్తిచెందుతున్నాయని వెల్లడించారు. కాగా.. బీ.1.617 కరోనా వేరియంట్‌ను భారత్‌లో తొలిసారిగా గతేడాది గుర్తించారు.

Also Read:

గ్రామాల్లో ఈ వ్యాపారాలు చేస్తే మీరే లక్షాధికారులు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం.. ఏఏ బిజినెస్ చేయాలంటే..

డీఆర్‌డీవో 2DG డ్రగ్‌‌ను విడుదల చేసిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీడియో ..:DRDO’s anti-COVID drug 2-DG video.