Corona Virus Effect: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. నాగ్‌పూర్ జిల్లా పరిధిలో కరోనా కేసులు అధికంగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లను తాత్కాలికంగా మూసినట్లే వేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ప్రకటించారు. మార్చి 7వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్న ఆయన.. తదుపరి పరిణామాలను అనుసరించి నిర్ణయం ఉంటుందని చెప్పారు. అలాగే ప్రధాన మార్కెట్లు వారాంతాల్లో మూసివేయాలని నిర్ణయించారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు 50శాతం సామర్థ్యంతో నడిపేందుకు అనుమతిస్తామన్నారు. ఫంక్షన్ హాళ్లను ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 7 వ తేదీ వరకు పూర్తిగా మూసివేయబడుతాయని మంత్రి స్పష్టం చేశారు. మార్చి 7 తరువాత పరస్థితులను బట్టి వాటిని తెరవాలా? లేదా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకపోతే మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 6,971 కొత్త కరోనా కేసులు నమోదు అవ్వగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 21,00,884 చేరింది.
ANI Tweet:
Due to rising COVID cases in Nagpur Dist, schools, colleges, coaching classes to remain closed till Mar 7, main markets to remain closed on weekends. Hotels,restaurants to run at 50% capacity&marriage halls to be closed after Feb25 till Mar 7:Nitin Raut, guardian minister, Nagpur pic.twitter.com/4aRljs7465
— ANI (@ANI) February 22, 2021
Also read:
‘ఏసీ కార్ల నుంచి బయటకు రండి, ప్రజల బాధలు చూడండి’, సైకిల్ తొక్కుతూ మోదీకి వాధ్రా ‘పిలుపు’