కాచిగూడలో మొదటిసారిగా శానిటైజింగ్ బస్సు

| Edited By:

Apr 18, 2020 | 2:45 PM

హైదరాబాద్‌‌ కాచిగూడలో మొదటిసారిగా శానిటైజింగ్‌ బస్సు రెడీ చేశారు. పాతబస్సులో సీట్లు తొలగించి రెండు వైపులా కిటికీలకు పైభాగాల్లో లిక్విడ్‌ను స్ప్రే చేసే..

కాచిగూడలో మొదటిసారిగా శానిటైజింగ్ బస్సు
Follow us on

తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. అంతకంతకూ తగ్గాల్సి పోయి.. ఇంకా ఎక్కువ కావడంతో అధికారులతో పాటు ప్రజలు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 766 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 18 మంది మరణించారు. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్‌లోనే 286 కేసులతో మొదటి స్థానంలో ఉంది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

ఇందులో భాగంగా హైదరాబాద్‌‌ కాచిగూడలో మొదటిసారిగా శానిటైజింగ్‌ బస్సు రెడీ చేశారు. పాతబస్సులో సీట్లు తొలగించి రెండు వైపులా కిటికీలకు పైభాగాల్లో లిక్విడ్‌ను స్ప్రే చేసే 12 నాజిల్స్‌ ఏర్పాటు చేశారు. బస్సులో 200 లీటర్ల కెపాసిటీ ఉండేలా ట్యాంక్‌ ఏర్పాటు చేశారు. దీనికి మోటార్‌ బిగించారు. వెనక డోర్‌ నుంచి ముందు డోర్‌ వరకు రెండువైపులా పైపులను ఏర్పాటు చేశారు.

Read More: 

ప్రభాస్‌ మాట్లాడితే వెర్రిబాగులోడులా ఉంటాడు..

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

యాంటీబాడీస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన.. ఆ ఆశలపై నీళ్లు..