మద్యం అమ్మకాలపై కేంద్రానికి ఫిర్యాదు : బీజేపీ

|

May 04, 2020 | 4:33 PM

రాష్ట్రంలో ప్రస్తుతం వున్న విపత్కర పరిస్తితుల్లో మద్యం విక్రయాలు అనుమతించటం దారుణమని బీజేపీ

మద్యం అమ్మకాలపై కేంద్రానికి ఫిర్యాదు : బీజేపీ
Follow us on

ఏపీలో ఓ వైపు క‌రోనా విల‌యతాండ‌వం చేస్తోంది. మ‌రోవైపు ప్ర‌భుత్వం మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తిచ్చింది. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్రంలో ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారింది. చాలాచోట్ల మ‌ద్యం షాపులు తెరుచుకోవ‌డంతో మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. పొరుగు రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటి మీర కొంద‌రు మ‌ద్యం ప్రియులు ఏపీకి క్యూ క‌ట్టారు. దీంతో ఇటు ఏపీ- తెలంగా, అటు ఏపీ – త‌మిళ‌నాడు బార్డ‌ర్‌లో అనూహ్య‌మైన ర‌ద్దీ ఏర్ప‌డింది. వారిని అదుపు చేయ‌డానికి పోలీసుల‌కు కూడా త‌ల‌నొప్పిగా మారింది. దీంతో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స్థానిక బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. స‌ర్కార్ చ‌ర్య‌ల‌పై కేంద్రానికి కంప్లైట్ చేస్తామంటున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం వున్న విపత్కర పరిస్తితుల్లో మద్యం విక్రయాలు అనుమతించటం దారుణమని బీజేపీ గుంటూరు అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు అమ్మిశెట్టీ ఆంజనేయులు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కేవలం ఆదాయమే ప్రధానంగా వ్యవహరిస్తుందని  విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను అనుమతించటం పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు  చెప్పారు. గత ఆరు వారాలుగా ప్రజలంతా మద్యం లేకుండా అలవాటు పడిపోయారన్నారు. ఈ స్థితిలో మద్యం అందుబాటులోకి తీసుకువస్తే, అది విపరీత పరిణామాల‌కు దారితీసే అవకాశముందన్నారు.