తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు.. వివరాలు ఇవే..

|

May 01, 2020 | 1:23 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, హైదరాబాద్‌, సూర్యపేట, రంగారెడ్డి జిల్లాలు రెడ్ జోన్‌లో ఉండగా.. నిజామాబాద్‌, గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. ఇక గ్రీన్ జోన్‌లోకి పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, […]

తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు.. వివరాలు ఇవే..
Follow us on

రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, హైదరాబాద్‌, సూర్యపేట, రంగారెడ్డి జిల్లాలు రెడ్ జోన్‌లో ఉండగా.. నిజామాబాద్‌, గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. ఇక గ్రీన్ జోన్‌లోకి పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి జిల్లాలు ఉన్నట్లు ప్రకటించారు.

కాగా, రాష్ట్రంలో గ‌త మూడు, నాలుగు రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు గురువారం స్వ‌ల్పంగా పెరిగాయి. కొత్త‌గా 22 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ముగ్గురు మ‌ర‌ణించారు. ఈ మేర‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిసి రాష్ట్రంలో క‌రోనా సోకిన వారి సంఖ్య మొత్తం 1038కి పెరిగింది. అటు హైద‌రాబాద్ మిన‌హా ఇత‌ర జిల్లాల్లో కొత్త కేసులు న‌మోదుకావ‌డం లేద‌ని అధికారులు గుర్తించారు.

Read This: ఇంగ్లీషు మాధ్యమానికే ప్రజల ఓటు..