ఇంగ్లీషు మాధ్యమానికే ప్రజల ఓటు..

సర్కారీ బడులలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు ఓటేశారు. ఈమేరకు తమ ఐఛ్చికాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. సుమారు 96.17శాతం మంది తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలంటూ జై కొట్టారు. విద్యారంగంలో భారీ సంస్కరణలు తీసుకురావడానికి జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  విద్యార్థులకు ప్రపంచస్థాయి […]

ఇంగ్లీషు మాధ్యమానికే ప్రజల ఓటు..
Follow us

|

Updated on: Apr 30, 2020 | 8:51 PM

సర్కారీ బడులలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు ఓటేశారు. ఈమేరకు తమ ఐఛ్చికాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. సుమారు 96.17శాతం మంది తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలంటూ జై కొట్టారు.

విద్యారంగంలో భారీ సంస్కరణలు తీసుకురావడానికి జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  విద్యార్థులకు ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని అందించడానికి, అంతర్జాతీయంగా ఉన్న పోటీ వాతావరణాన్ని ఎదుర్కుని నిలబడేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుత 2019 – 2020 విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకుంది. 3 ఆప్షన్లతో కూడిన ప్రత్యేక ఫార్మాట్‌ను వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రులకు చేరవేశారు.

  • ఇంగ్లిషు మీడియంలో బోధిస్తూ, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు
  • తెలుగు మీడియం
  • ఇతర భాషా మీడియం

ఈ మూడు ఆప్షన్లపై తల్లిదండ్రులు, స్వేచ్ఛగా టిక్‌చేసి, సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందులో మొదటి ఐచ్ఛికాన్ని టిక్‌ చేస్తూ, తమ అంగీకారం తెలుపుతూ 96.17శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియంను కోరుకున్నవారు 3.05 శాతం మంది. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం. ఈ గణాంకాలు అన్నీ కూడా ఏప్రిల్ 29 వరకు వచ్చిన వాటి ప్రకారం నమోదైనవి.

Read Also:

ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!

తెరపైకి మరో కొత్త పేరు.. కిమ్ వారసుడు ఆయనేనట.!

లాక్ డౌన్ బేఖాతర్.. గుంపులుగా సామూహిక ప్రార్ధనలు..

మే 3 తర్వాత లాక్ డౌన్ 3.0 ఖాయమేనా.?

కరోనా మాటున పాకిస్తాన్ భారీ కుట్ర.. భారత సైన్యానికి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..

కరోనా కాలంలో జగన్ ప్రభుత్వం మరో సంచలనం..

తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.