జర్నలిస్టులపై కరోనా ఎఫెక్ట్.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు పవన్ రిక్వెస్ట్

| Edited By:

Apr 23, 2020 | 7:16 PM

కరోనా విపత్తులోనూ కూడా ఎంతో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తోన్న జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కరోనా విపత్తులోనూ తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు..

జర్నలిస్టులపై కరోనా ఎఫెక్ట్.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు పవన్ రిక్వెస్ట్
Follow us on

కరోనా విపత్తులోనూ కూడా ఎంతో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తోన్న జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కరోనా విపత్తులోనూ తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు చాలా ధైర్యంగా పని చేస్తూ, క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు సమచారం అందిస్తున్నారని కొనియాడారు. అలాగే పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ విధులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తాజాగా తమిళనాడులో 25 మంది, ముంబైలో 50 మందికి పైగా జర్నలిస్టులకు కరోనా బారిన పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులకు అవసరమైన ఆరోగ్య భద్రత, బీమా కల్పించాలని పవన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి జర్నలిస్టులను అభినందిస్తూ.. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ట్వీట్లు చేశారు.

Read More: 

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం