ఉత్తర్‌ప్రదేశ్‌లో 82 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. డాక్టర్ల సలహా, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మనోధైర్యం ఆమెను కరోనా జయించేలా చేసాయి. కేవలం 12 రోజులు హోం ఐసోలేషన్ లో ఉండి కరోనా నుంచి బయటపడింది బామ్మ. వృద్ధురాలికి కరోనా సోకి ఆక్సిజన్ లెవల్స్ 79కి పడిపోయాయి.ఆందోళన పడ్డ ఆమె కుమారుడు డాక్టర్లను సంపద్రించాడు. ఆక్సిజన్ లెవల్స్ పెరిగేందుకు ప్రోనింగ్ పొజిషన్ ప్రాక్టీస్ చేయించారు. కేవలం నాలుగు రోజుల్లో ఆక్సిజన్ లెవెల్ 94కి పెరిగింది. డయాబెటిస్ , అధిక రక్తపోటు సమస్యలు ఉన్నప్పటికీ ఆమె కోలుకుంది.
కరోనా వైరస్ సోకిన బాధితులకు ఊపిరి సరిగా అందనప్పుడు బోర్లా పడుకుని శ్వాస పీల్చాలన్నదే ప్రోనింగ్. ఆస్పత్రులలో ఊపరి ఆడని కరోనా పేషెంట్లకు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. రోజులో ఒక సారి 30 నిమిషాల పాటు ప్రోనింగ్ చేయడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని డాక్టర్లు అంటున్నారు. ప్రోనింగ్‌తో మెరుగైన ఫలితాలుంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది. కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న వేళ కాస్త ఊరట కలిగించే వార్త ఇది.
Also Read: కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..? టీకాలపై జీఎస్టీ తొలగించే అవకాశం