Covid-19 Vaccine: ప్రైవేటు ఆసుపత్రులు.. స్టార్ హోటళ్ల వ్యాక్సిన్ దందాను సహించేది లేదు.. కేంద్రం హెచ్చరిక

|

May 30, 2021 | 5:38 PM

Covid-19 vaccine packages: ప్రైవేట్​ ఆసుపత్రులు.. స్టార్ హోటల్స్​తో కలిసి నడిపిస్తున్న వ్యాక్సినేషన్​ దందాలను సహించేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టార్ హోటళ్లలో టీకాలు

Covid-19 Vaccine: ప్రైవేటు ఆసుపత్రులు.. స్టార్ హోటళ్ల వ్యాక్సిన్ దందాను సహించేది లేదు.. కేంద్రం హెచ్చరిక
Covid-19 Vaccine
Follow us on

Covid-19 vaccine packages: ప్రైవేట్​ ఆసుపత్రులు.. స్టార్ హోటల్స్​తో కలిసి నడిపిస్తున్న వ్యాక్సినేషన్​ దందాలను సహించేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టార్ హోటళ్లలో టీకాలు వేయవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది ముమ్మాటికీ నిబంధనలకు విరుద్ధమని, అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌.. వ్యాక్సినేషన్​ గైడ్​లెన్స్​​, స్టార్ హోటల్స్‌లల్లో వ్యాక్సినేషన్ గురించి స్పష్టతనిస్తూ లేఖలను శనివారం పంపించారు. హోటళ్లలో వ్యాక్సిన్ వేయడం జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమ నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టంచేశారు.

వ్యాక్సిన్ ఏయే ప్రదేశాల్లో వేయాలో, ఏయే ప్రదేశాల్లో వేయకూడదో కూడా కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకాలు వేయొచ్చని తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించే టీకా సెంటర్, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు కంపెనీల పరిధిలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే వర్క్ ప్లేస్ వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకాలు వేయొచ్చని సూచించింది. వయో వృద్ధులు, దివ్యాంగుల గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు, పంచాయతీ భవనాలు, స్కూళ్లు, కళాశాలలు, వృద్ధాశ్రమాలు, పలు స్వచ్ఛంధ సంస్థలు తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో తప్ప మిగతా ఎక్కడా టీకాలు వేయొద్దని సూచించింది. అయితే.. ఇటీవల స్టార్, లగ్జరీ హోటళ్లలో ప్యాకేజీల పేరిట వ్యాక్సిన్ అందించడం నిబంధనలకు విరుద్ధమని వెంటనే అలాంటి వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలువరించాలంటూ కేంద్రం సూచించింది.

Also Read:

Shocking Video: షాకింగ్ వీడియో.. కోవిడ్‌ మృతదేహాన్ని నదిలో పడేసిన వ్యక్తులు..

Earthquake: అస్సాంలో మళ్లీ భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..