Corona: వారికి వర్క్​ ఫ్రం హోం.. కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త మార్గదర్శకాలు

|

Jan 09, 2022 | 7:37 PM

దేశంలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. ఒమిక్రాన్ వేరియంగ్ వ్యాప్తి కూడా వేగంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Corona: వారికి వర్క్​ ఫ్రం హోం.. కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త మార్గదర్శకాలు
Employees
Follow us on

దేశంలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. ఒమిక్రాన్ వేరియంగ్ వ్యాప్తి కూడా వేగంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వారికి ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

కొవిడ్​ కంటైన్​మెంట్​ జోన్లలో నివాసం ఉంటున్న అధికారులు, ఇతర సిబ్బందికి కూడా మినహాయింపు ఉంటుందని తెలిపారు సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్​. అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కార్యదర్శి కంటే కిందిస్థాయి ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. మిగతా 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని వివరించారు.   అందుకు అనుగుణంగా లిస్ట్ రెడీ అవుతుందని ప్రకటించారు.

వర్క్​ ఫ్రం హోం చేసే ఎంప్లాయిస్.. ఫోన్​, ఇతర ఎలక్ట్రానిక్​ డివైజెస్ ద్వారా అందుబాటులోనే ఉంటారని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. అధికారిక సమావేశాలను దాదాపు వీడియో కాన్ఫరెన్స్​ పద్ధతిలోనే నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు  సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 31వరకు ఇవి అమల్లో ఉండనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

Also Read: కరోనా పట్ల భయాందోళనలు అక్కరలేదు.. స్వీయ నియంత్రణతో పండుగలు జరుపుకోండిః కేసీఆర్