ఏప్రిల్ 27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..

| Edited By:

Apr 22, 2020 | 7:05 PM

ప్రధాని మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనాపై మాట్లాడనున్నారు. ఏప్రిల్ 27న ఉదయం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరపనున్నారు. మే 3న లాక్‌డౌన్ ముగియనుండటంతో..

ఏప్రిల్ 27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..
Follow us on

ప్రధాని మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనాపై మాట్లాడనున్నారు. ఏప్రిల్ 27న ఉదయం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరపనున్నారు. మే 3న లాక్‌డౌన్ ముగియనుండటంతో.. అంతకు ఆరు రోజుల ముందే సీఎంలతో ప్రధాని కాన్ఫరెన్స్ నిర్వహించనుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రభావం, కరోనా విజృంభణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.

అలాగే మరోసారి లాక్‌డౌన్ పొడిగించాలా? వద్దా? అనే దానిపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకునే అవకాశముంది. కరోనాని కట్టడి చేయడానికి రాష్ట్రాలు ఏ చర్యలు చేపట్టాయి? అనే విషయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 20 వేలు దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటివరకూ 20,471 మంది వైరస్ బారిన పడగా, 652 మంది మృతి చెందినట్లు స్పష్టం చేసింది. అలాగే 3,960 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..