AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి

ప్రధాని మంత్రి ప్రకటించిన 'కిసాన్ స్కీమ్' డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఈ చిన్న తప్పులను సవరించుకుంటే.. ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతుల అకౌంట్లలోకి...

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 26, 2020 | 3:33 PM

Share

ప్రధాని మంత్రి ప్రకటించిన ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఈ చిన్న తప్పులను సవరించుకుంటే.. ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతుల అకౌంట్లలోకి రూ.6 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ డబ్బును మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నిధుల్ని విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 14.3 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి ఆరు వేల రూపాయలను పొందుతున్నారు. ఇటీవల లాక్‌డౌన్ కారణంగా కాస్త ముందుగానే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా డబ్బులను విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఒక్క చిన్న తప్పు వల్ల 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని తెలిసింది. ఈ రైతుల అకౌంట్లలోకి మూడు విడతల్లో రూ.4,200 కోట్లు జమ కావాల్సి ఉంది. కానీ ఆ చిన్న తప్పు వల్ల వారి అకౌంట్లలో జమ అయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇంతకీ ఆ తప్పు ఏంటంటే.. స్పెల్లింగ్ మిస్టేక్స్.

రైతుల పేర్లలో చిన్న తప్పుల కారణంగా ఆ డబ్బు అకౌంట్‌లోకి జమ కాలేదు. ఈ తప్పు సరిదిద్దుకోకపోతే వారి అకౌంట్లలోకి డబ్బులు జమ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి మరోసారి లబ్ధిదారులు బ్యాంక్‌కు వెళ్లి వారి పేర్లను ఒకసారి సరి చేసుకుంటే మంచిది. ఆధార్ కార్డులో ఒక పేరు, బ్యాంక్‌లో ఒక పేరు ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. దీంతో చాలా మంది రైతులు.. ఈ డబ్బును అందుకోలేకపోతున్నారు.

కాగా రైతులు తమ పేరును మరో విధంగా కూడా సరిదిద్దుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయాలి. ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్‌మిట్ చేసిన వివరాలు కనిపిస్తాయి. మరోసారి వివరాలు చెక్ చేసుకొని.. తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దు కోవచ్చు.

Read More: 

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..

Follow Us
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్
పొడిబారిన జుట్టుకు ఇంట్లోనే సహజమైన కండీషనింగ్
పొడిబారిన జుట్టుకు ఇంట్లోనే సహజమైన కండీషనింగ్
చియా Vs సబ్జా.. వీటిని ఇలా తిన్నారో ప్రాణాలకే రిస్క్..
చియా Vs సబ్జా.. వీటిని ఇలా తిన్నారో ప్రాణాలకే రిస్క్..
దేశ రాజధానిలో టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్.. మూడవసారి..
దేశ రాజధానిలో టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్.. మూడవసారి..
సలకం చెరువులోని MIM నేత కాలేజీని ఎందుకు కూల్చలేదు ??
సలకం చెరువులోని MIM నేత కాలేజీని ఎందుకు కూల్చలేదు ??
కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??
కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??