‘ప్లాస్మా థెరపీ’తో పెద్ద ప్రయోజనం లేదు: ఐసీఎంఆర్‌

కరోనా నుంచి కోలుకునేందుకు పలుచోట్ల ప్లాస్మా థెరపీని చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి

'ప్లాస్మా థెరపీ'తో పెద్ద ప్రయోజనం లేదు: ఐసీఎంఆర్‌
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 12:09 PM

Coronavirus Plasma Therapy: కరోనా నుంచి కోలుకునేందుకు పలుచోట్ల ప్లాస్మా థెరపీని చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి, బాధితులకు ఎక్కించడం వలన రికవరీ రేటు పెరుగుతుందని అందరూ భావించారు. అయితే కరోనా మరణాల రేటును తగ్గించడంలో ప్లాస్మా థెరపీ పెద్దగా ఉపయోగపడటం లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) అధ్యయనంలో తేలింది. అంతేకాదు కరోనా తీవ్రం అవ్వకుండా అడ్డుకోవడంలోనూ ఈ చికిత్సా విధానం పెద్దగా ప్రయోజనం చూపడం లేదని ఐసీఎంఆర్ తెలిపింది.

దేశవ్యాప్తంగా 29 కరోనా చికిత్స కేంద్రాల్లో 464 మందిపై ఐసీఎంఆర్‌ ఈ అధ్యయనం చేపట్టింది. వీరిలో 235 మందికి ప్రామాణిక చికిత్సా విధానంతో పాటు ప్లాస్మా థెరపీని అందించారు. మిగిలిన వారికి ప్రామాణిక చికిత్స అందించారు. 28 రోజుల పర్యవేక్షణలో ప్లాస్మా థెరపీ ఇవ్వడం వలన పెద్దగా ప్రయోజనం లేదన్న వారు తెలిపారు. అలాగే తక్కువ లక్షణాలున్న వారు విషమ పరిస్థితుల్లోకి వెళ్లడంలో పెద్దగా తేడా కనిపించలేదని అధ్యయనంలో పాల్గొన్న వారు తెలిపారు. కాగా చికిత్సకు ముందు దాత, రోగిలో యాంటీబాడీల సంఖ్యను లెక్కించడం వలన ఈ థెరపీ ప్రయోజనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. ఇక ఈ చికిత్సకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం లభించింది. ప్లాస్మాదానం ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.

Read More:

పీసీ శ్రీరామ్‌ వ్యాఖ్యలపై కంగనా స్పందన.. ‘ఆల్‌ ది బెస్ట్’ అంటూ ట్వీట్‌

ప్రయోగాలకు సిద్ధమవుతోన్న ‘ఇస్రో’.. డిసెంబర్‌లోపు ‘పీఎస్‌ఎల్‌వీ సీ49’