ప్రయోగాలకు సిద్ధమవుతోన్న ‘ఇస్రో’.. డిసెంబర్‌లోపు ‘పీఎస్‌ఎల్‌వీ సీ49’

కరోనా కారణంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైతం ప్రయోగాలను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే

ప్రయోగాలకు సిద్ధమవుతోన్న 'ఇస్రో'.. డిసెంబర్‌లోపు 'పీఎస్‌ఎల్‌వీ సీ49'
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 11:50 AM

ISRO PSLV c49 news: కరోనా కారణంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైతం ప్రయోగాలను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు అన్ని రంగాలు తమ పనులను తిరిగి ప్రారంభిస్తుండటంతో.. ఇస్రో కూడా ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఈ డిసెంబర్‌లోపు ఓ ప్రయోగమైన చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో పీఎస్‌ఎల్‌వీ సీ 49 ప్రయోగాన్నిపూర్తి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అలాగే 2021 మార్చి ఆఖరు నాటికి పీఎస్‌ఎల్‌వీ సీ50, ఈ ఏడాది మార్చి5న ఆఖరి నిమిషంలో వాయిదా పడిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 ప్రయోగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే చిన్న చిన్న ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించేందుకు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రయోగాన్ని కూడా  ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ భౌతిక దూరాన్ని పాటిస్తూ..  50 శాతం మంది అధికారులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారు.

Read More:

హిట్‌ ఇచ్చాడు.. కాస్ట్‌లీ గిఫ్ట్‌ పట్టాడు

సీతానగరం శిరోముండనం కేసు: ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు