Post Corona symptoms: కంటికి కనిపించని ఓ వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ప్రజల ఆరోగ్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందీ మాయదారి రోగం. కరోనా బారిన పడినవారు క్షణాల్లో ఆక్సిజన్ అందక ప్రాణాలు వదులుతున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా సోకిన సమయంలో దగ్గు, జలుబు, తలతొప్పి వంటి ఎన్నో లక్షణాలు తీవ్రంగా బాధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇందులో కొన్ని ధీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కరోనా నుంచి కోలుకున్న ప్రతీ 10 మంది భారతీయుల్లో ఒకరు కరోనా జయించిన తర్వాత కూడా తీవ్ర లక్షణాలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. అలాంటి కొన్ని కరోనా లక్షణాలపై ఓ లుక్కేయండి..
కరోనా బాధితుల్లో ఎక్కువగా కనిపించే లక్షణాల్లో దగ్గు ప్రధానమైంది. అయితే ఇది కొందరిలో తక్కువ మోతాదులో ఉంటే మరి కొందరిలో తీవ్రంగా కనిపిస్తోంది. అయితే కరోనా నుంచి బయట పడ్డ తర్వాత కూడా దగ్గు కొనసాగుతున్నట్లు గుర్తించారు.
కరోనా సోకిన సమయంలో చాలా మంది ఒళ్లు నొప్పులు సమస్యతో బాధపడే ఉంటారు. అయితే కరోనా నుంచి కోలుకున్నతర్వాత కొన్ని నెలల వరకు కూడా ఈ లక్షణం కొనసాగుతూనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు దీర్ఘకాలికంగా కొనసాగుతున్నట్లు గుర్తించారు.
కరోనా నుంచి కోలుకున్న కొందరిలో నిద్రలేమి సమస్యను గుర్తించారు. కరోనా కారణంగా ఏర్పడే ఒత్తిడి, ఆందోళ కూడా నిద్రలేమికి దారి తీస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యోగా, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
అధ్యయనాల్లో తేలిన వివరాల ప్రకారం కరోనా కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. అంతకు ముందు ఎలాంటి కిడ్నీ సమ్యలు లేని వారికి కూడా కిడ్నీల పనితీరు దెబ్బతింటున్నట్లు పరిశోధనల్లో తేలింది. కరోనా నుంచి కోలుకొని రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతోన్న వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్న వారిలో కాళ్ల నొప్పులు, వాపు వంటి లక్షణాలున్న వారు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే కొందరిలో రక్తం గడ్డకడుతున్నట్లు కూడా తేలింది.
Also Read: Bamboo leaf tea: వెదురు ఆకులతో అదిరిపోయే ఛాయ్.. రుచి చాలా మధురమట
Mini Human Heart: వైద్య రంగంలో మరో అద్భుతం.. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సరికొత్త ఆవిష్కరణ..