కుల వ‌ృత్తులను ఆదుకునే దిక్కెవరు…? -పవన్ కళ్యాణ్

|

Jul 01, 2020 | 10:51 AM

జీవో 272 కారణంగా పోలీసుల చేతిలో స్వర్ణకారులు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. అనవసరపు వేధింపులతో స్వర్ణకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని పోలీసులకు హితవు పలికారు. తప్పేదైనా ఉంటే..

కుల వ‌ృత్తులను ఆదుకునే దిక్కెవరు...? -పవన్ కళ్యాణ్
Follow us on

లాక్ డౌన్ సమయంలో స్వర్ణకారులు తమ ఉపాధికి దూరమయ్యారని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కుల వృత్తిపై జీవనం గడుపుతున్న ఇలాంటి వారిపై పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా వ్యాప్తి కారణంగా మరికొన్ని నెలల పాటు ప్రజలు ఎలాంటి శుభకార్యాలు చేసుకునే స్థితి కనిపించడం లేదు. దీంతో.. బంగారు, వెండి ఆభరణాల తయారీకి విఘాతం ఏర్పడుతోందని అన్నారు. రాష్ట్రంలో 14 లక్షల స్వర్ణకార, విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయని… వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వర్ణకారులకు ఇది నిజంగా కష్టకాలమేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అంతేకాదు, జీవో 272 కారణంగా పోలీసుల చేతిలో స్వర్ణకారులు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. అనవసరపు వేధింపులతో స్వర్ణకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని పోలీసులకు హితవు పలికారు. తప్పేదైనా ఉంటే స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విచారణ జరిపిన తర్వాతే.. కేసులు నమోదు చేయాలని సూచించారు.