కరోనాకు మందు ప్రయోగ దశలో…

కరోనాకు విరుగుడు తయారీ ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. రెండో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌కు సిద్ధమైంది ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ. ఏప్రిల్‌లో ప్రారంభించిన మొదటిదశ పరీక్షల్లో మెరుగైన ఫలితాలొస్తున్నాయని అందుకే సెకండ్‌ ఫేజ్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం వాలంటీర్ల ఎంపికను ప్రారంభించింది వర్సిటీ. 56ఏళ్ల పైబడిన వారు.. 5 నుంచి 12ఏళ్ల మధ్య ఉన్నవారు.. మొత్తం10,260 మందిపై దీన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. ఇది పూర్తైతే మూడో దశ కూడా మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. ఈ దశలో 18 ఏళ్లు […]

కరోనాకు మందు ప్రయోగ దశలో...
Follow us

|

Updated on: May 23, 2020 | 9:52 AM

కరోనాకు విరుగుడు తయారీ ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. రెండో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌కు సిద్ధమైంది ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ. ఏప్రిల్‌లో ప్రారంభించిన మొదటిదశ పరీక్షల్లో మెరుగైన ఫలితాలొస్తున్నాయని అందుకే సెకండ్‌ ఫేజ్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం వాలంటీర్ల ఎంపికను ప్రారంభించింది వర్సిటీ. 56ఏళ్ల పైబడిన వారు.. 5 నుంచి 12ఏళ్ల మధ్య ఉన్నవారు.. మొత్తం10,260 మందిపై దీన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. ఇది పూర్తైతే మూడో దశ కూడా మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. ఈ దశలో 18 ఏళ్లు పైబడిన వారిపై వ్యాక్సీన్‌ను ప్రయోగిస్తారు. తొలిదశలో వెయ్యి మందిపై ప్రయోగాలు నిర్వహించారు. అవి మనుషులపై చూపించే ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు.

అయితే చింపాంజీల నుంచి సేకరించిన అడినో వైరస్‌తో టీకా అభివృద్ధి చేసింది ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ. పలు జన్యుపరమైన మార్పులు చేసి సార్స్‌ కోవ్‌ 2లో ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ వంటి దానిని ఏర్పాటుచేశారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ కోతుల్లో చేసిన స్టడీస్‌లో కొన్ని మంచి ఫలితాలను చూపించిందని అంటున్నారు. ఇది రోగ నిరోధక శక్తిని అంచనా వేసేందుకు విస్తృత జనాభాలో ఇది రక్షణను అందించగలదా అని పరీక్షించడానికి అధ్యయనాలు చేస్తున్నామన్నారు. రోగ నిరోధక శక్తిని అంచనా వేయడానికి.. టీకా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు పరిశోధకులు.

ఈ వ్యాక్సిన్‌ ప్రయోగంలో రెండు, మూడు దశలే కీలకం. కొందరికి కరోనా టీకా ఇస్తారు. మరికొందరికి మెనాక్వీ అనే టీకా ఇస్తారు. ఎవరికి ఏ టీకా ఇచ్చారో సీక్రెట్‌గా ఉంచుతారు. ఈ ప్రయోగంలో ఎవరికి ఏ టీకా ఇచ్చారో తెలియకుండా ఉండేందుకు మెన్‌యాక్వీని ఎంపిక చేశారు. ఈ రెండు టీకాలు తీసుకున్నవారికి ఒకే లక్షణాలు ఉంటాయి. కొవిడ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేస్తారు. సైడ్‌ ఎఫెక్ట్‌లు లేకుండా రోగనిరోధక శక్తి ఎలా ఉందో పరిశీలిస్తారు. టీకా వేయించుకున్న వారం తర్వాత శాంపిల్స్‌ను ల్యాబ్స్‌కు పంపి పరీక్షలు నిర్వహిస్తారు. ఆక్స్‌ఫర్డ్‌ టీకా తీసుకున్న వారిలో సానుకూల ఫలితాలను బట్టి గ్రీన్‌సిగ్నల్‌ లభిస్తుంది. అందుకే ఈ ప్రయోగానికి కొవిడ్‌ బారిన పడే అవకాశమున్న చోట విధులు నిర్వహిస్తున్న వారిని ఎంపిక చేశారు. వీరిలో వైద్య సిబ్బంది, ఇతర కీలక విభాగాల్లో పనిచేసే వారున్నారు.

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!