మరో ఐటీబీపీ సిబ్బందికి కరోనా.. యాక్టివ్‌గా 22 కేసులు…

| Edited By:

Jun 10, 2020 | 8:55 PM

కరోనా మహమ్మారి ఇండో-టిబేటన్ బోర్డర్ పోలీసులను వణికిస్తోంది. తాజాగా బుధవారం నాడు మరో సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న సిబ్బంది సంఖ్య 22కు చేరింది.

మరో ఐటీబీపీ సిబ్బందికి కరోనా.. యాక్టివ్‌గా 22 కేసులు...
Follow us on

కరోనా మహమ్మారి ఇండో-టిబేటన్ బోర్డర్ పోలీసులను వణికిస్తోంది. తాజాగా బుధవారం నాడు మరో సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న సిబ్బంది సంఖ్య 22కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ సిబ్బందిలో 194 మంది రికవరీ అయ్యి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ విషయాన్ని ఇండో-టిబేటన్ బోర్డర్‌ పోలీస్ అధికారులు తెలిపారు.

కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,76,583 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 7 వేల మందికి పైగా మరణించారు. అయితే యాక్టివ్‌ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు
నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.