కరోనా సైడ్‌ ఎఫెక్ట్‌లు.. ప్రతి ఐదుగురిలో ఒకరికి మానసిక అనారోగ్య సమస్యలు..!

| Edited By:

Nov 12, 2020 | 9:33 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

కరోనా సైడ్‌ ఎఫెక్ట్‌లు.. ప్రతి ఐదుగురిలో ఒకరికి మానసిక అనారోగ్య సమస్యలు..!
Follow us on

Corona Mental Health: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఇక ఈ వైరస్‌కి వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే కరోనా వచ్చిన వారిలో చాలా మంది ఈ వైరస్‌ని జయిస్తున్నప్పటికీ, దీని వలన సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ, నరాల వ్యవస్థ, గుండె, కిడ్నీలపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇక తాజాగా ఈ మహమ్మారి మానసిక సమస్యలను సృష్టిస్తున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనంలో తేలింది. (Bigg Boss 4: అఖిల్‌ని తలచుకొని ఏడ్చేసిన మోనాల్‌, సొహైల్‌)

కరోనా మెదడుపై ప్రభావం చూపడంతో పాటు నిద్రలేమి, మనోవ్యథ, కుంగుబాటు, ఒత్తిళ్లు, ఆదుర్దా, ఆందోళన, అయోమయం వంటి మానసిక అనారోగ్యాలకు కారణమవుతున్నట్టు ఆ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా కరోనా సోకి మరణం అంచు వరకు వెళ్లి తిరిగొచ్చిన వారిలో ఈ మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు తేలింది. ఇంకా చెప్పాలంటూ ప్రతి ఐదు మందిలో ఒకరికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో వారు ఆస్పత్రులకు చికిత్సకు వస్తున్నట్టు తెలిసింది. ఈ వివరాలు ఇటీవల ‘లాన్సెట్‌ సైకియాట్రీ’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. (Bigg Boss 4: సీక్రెట్‌ రూమ్‌కి అఖిల్‌.. అభికి అర్థం అయ్యిందా..!

ఇక కరోనా కారణంగా కలుగుతున్న మానసిక అనారోగ్యం వలన కొందరిలో చిత్తవైకల్యం, మెదడు సరిగా పనిచేయకపోవడం వంటి తీవ్ర సమస్యలూ ఎదురయ్యే అవకాశాలున్నట్టు బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పాల్‌ హారిసన్‌ చెబుతున్నారు. కరోనా కేంద్ర నాడీమండల వ్యవస్థపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడం వలన ఇతర మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయని లండన్‌ కింగ్స్‌ కాలేజీ సైకియాట్రీ ప్రొఫెసర్‌ సైమన్‌ వెస్లీ అంటున్నారు.