Omicron New Symptom: ఒమిక్రాన్ కొత్త లక్షణం వెలుగులోకి.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..

|

Jan 24, 2022 | 2:43 PM

Omicron New Symptom: భారతదేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తక్కువ లక్షణాలతో వేగంగా విస్తరిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్న

Omicron New Symptom: ఒమిక్రాన్ కొత్త లక్షణం వెలుగులోకి.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..
Covid
Follow us on

Omicron New Symptom: భారతదేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తక్కువ లక్షణాలతో వేగంగా విస్తరిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారిని కూడా విడిచిపెట్టడం లేదు. తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ ఇది ప్రజలకు హాని కలిగిస్తుంది. మరో విషయం ఏంటంటే కరోనాతో పోల్చితే ఒమిక్రాన్ లక్షణాలు వేరుగా ఉంటాయి. ఇటీవల స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని నిపుణుల బృందం ఒమిక్రాన్‌కి సంబంధించి కొత్త లక్షణాన్ని కనుగొంది.

ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ 

ఒమిక్రాన్ లక్షణాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇది కళ్ళ నుంచి మొదలుకొని గుండె, మెదడు వరకు అనేక శరీర భాగాలను ప్రభావితం చేస్తుంది. తాజాగా చెవులపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఒమిక్రాన్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని నిపుణులు కరోనా పేషెంట్లపై పరిశోధన నిర్వహించారు. ఇందులో భాగంగా ఒమిక్రాన్ రోగుల అంతర్గత చెవి నమూనాలను పరీక్షించారు. రోగులు చెవి నొప్పి, లోపల జలదరింపులకు సంబంధించిన సమస్యల గురించి ఫిర్యాదు చేస్తున్నారని తెలుసుకున్నారు.

మీరు చెవినొప్పి, రింగింగ్, విజిల్ లాంటివి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే కరోనా టెస్ట్‌ చేయించుకోవాల్సిందే. ఎందుకంటే ఒమిక్రాన్ పేషెంట్లలో చెవికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అంతేకాదు ఇది ఎక్కువగా టీకాలు వేసిన రోగులలో కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ధ్వని, వినికిడి సమస్యలు ఉన్నవారు ఎంత వీలైతే అంత తొందరగా డాక్టర్‌ని సంప్రదిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆలస్యమైతే ఇన్ఫెక్షన్ వినికిడి లోపానికి దారితీసే అవకాశాలు ఉంటాయని నిపుణుల బృందం తెలిపింది.

సాధారణంగా ఒమిక్రాన్ లక్షణాలు

చలి, గొంతు బొంగురు, శరీర నొప్పులు, బలహీనత, వాంతులు, రాత్రి చెమటలు, తేలికపాటి నుంచి తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, అలసట, తలనొప్పి ఉంటాయి.

Knowledge: ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?

JIO, Airtel: జియో, ఎయిర్‌టెల్‌ 300 ప్లాన్.. ధర ఒకే విధంగా ఉన్నా ప్రయోజనాలు వేరు..?

Delhi Rains: దేశ రాజధానిలో 122 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన వర్షం.. గత 24 గంటల్లో 19.7 మిల్లీమీటర్ల వర్షం