Omicron Variant: తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ వణుకు.. ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించిన రెండు రాష్ట్రాలు..

|

Dec 02, 2021 | 7:29 PM

కరోనా మళ్లీ దడ పుట్టిస్తోంది. మన దేశంలోకి రావద్దనుకుంటున్న ఒమిక్రాన్ రానే వచ్చింది. కర్నాటకలో రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

Omicron Variant: తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ వణుకు.. ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించిన రెండు రాష్ట్రాలు..
Omicron Test
Follow us on

కరోనా మళ్లీ దడ పుట్టిస్తోంది. మన దేశంలోకి రావద్దనుకుంటున్న ఒమిక్రాన్ రానే వచ్చింది. కర్నాటకలో రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తెలంగాణలో కరోనా దడ పుట్టిస్తోంది. కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఒమ్రికాన్‌ విజృంభిస్తున్న దేశాల నుంచి తెలంగాణకు 235 మంది వచ్చారు. అందులో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ రావడంతో టిమ్స్‌కు తరలించామన్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు. ఆమె శాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెల్స్‌కి పంపించామన్నారు. అయితే పరీక్షల తర్వాతే ఒమ్రికాన్‌ లేదా డెల్టా వేరియంటా ? అనేది బయట పడుతుందన్నారు.

ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయంటే.. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇంద్రేశం గురుకుల పాఠశాలలో 25 మందికి కరోనా సోకింది. ఈమధ్యే ముత్తంగి గురుకుల పాఠశాలలో 48 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఖమ్మం జిల్లా వైరా గురుకుల పాఠశాలలో 27 మందికి కరోనా సోకింది. ఓ వైపు కేసులు పెరగడం, మరో వైపు ఒమిక్రాన్ ఎంట్రీ దడ పుట్టిస్తోంది.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ సర్కారు ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది. మాస్క్‌ ధరించకుంటే ఫైన్‌ తప్పదన్నారు హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామన్నారు. పనిచేసే ప్రాంతాలు, పబ్లిక్‌ ప్రదేశాల్లో వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ కూడా వెరిఫై చేస్తామన్నారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అప్రమత్తమంగా ఉన్నామన్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌. జిల్లాల్లో అధికారులకు సూచనలు జారీ చేశారు, వ్యాక్సినేషన్‌ తక్కువగా జరుగుతున్న మండలాల్లో స్పెషల్‌ డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: CM KCR: వానాకాలంలో వ‌రి.. యాసంగిలో ఆ పంట‌లే వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచనలు..

Akhanda Movie: అఖండ మూవీ థియేటర్ సీజ్.. మ్యాట్నీ షోను అడ్డుకున్న అధికారులు.. ఎందుకంటే..