‘ఆరోగ్య సేతు యాప్ పై ఆందోళన అనవసరం’.. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

| Edited By: Pardhasaradhi Peri

May 02, 2020 | 5:09 PM

ఆరోగ్య సేతు యాప్ వల్ల వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతుందంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తోసిపుచ్చారు.  దగ్గరలో ఎవరైనా కరోనా పాజిటివ్ లక్షణాలు కలిగినవారుంటే మనలను అలర్ట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని, అంతే తప్ప ఇది వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయదన్నారు. ఇందులో ప్రైవసీ సంబంధ ఆందోళనే అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇది శాస్త్రీయంగా రూపొందించిన ఉత్తమ యాప్ అని పేర్కొన్నారు. ఏ […]

ఆరోగ్య సేతు యాప్ పై ఆందోళన అనవసరం.. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
Follow us on

ఆరోగ్య సేతు యాప్ వల్ల వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతుందంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తోసిపుచ్చారు.  దగ్గరలో ఎవరైనా కరోనా పాజిటివ్ లక్షణాలు కలిగినవారుంటే మనలను అలర్ట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని, అంతే తప్ప ఇది వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయదన్నారు. ఇందులో ప్రైవసీ సంబంధ ఆందోళనే అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇది శాస్త్రీయంగా రూపొందించిన ఉత్తమ యాప్ అని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా దగ్గు, జలుబు వంటి లక్షణాలతో పాజిటివ్ గా తేలితేనే సమాచారాన్ని భర్తీ చేయవలసి ఉంటుందని ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఈ యాప్ రానున్న ఒకటి రెండేళ్లు కూడా పని చేస్తుంది.. లాక్ డౌన్  ముగిసినా.. మనం కరోనాపై పూర్తి విజయం సాధించేంత వరకు ఇది మనకు సాయపడుతూనే ఉంటుంది అని ఆయన అన్నారు.

ఆరోగ్య సేతు యాప్ ని దేశంలో సుమారు ఎనిమిది కోట్లమంది ప్రజలు ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. పైగా ప్రతి వ్యక్తీ దీన్ని తప్పనిసరిగా వాడుకోవాలని కేంద్రం స్పష్టం చేస్తోంది.