AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊపిరి పీల్చుకుంటున్న కేరళ.. ఆదివారం కేసులు నిల్.. అంతేకాదు..

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. కేరళలో మాత్రం నెమ్మదిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు కేసులు ఓ రోజు పెరుగుతూ… మరో రోజు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. క్రమక్రమంగా కరోనా బారినుంచి కోలుకుని.. ఆస్పత్రుల నుంచి రోజుకు కొందరు డిశ్చార్జ్ అవుతుండటంతో కేరళ సర్కార్‌ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ క్రమంలో ఆదివారం కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి శైలజ కరోనా కేసులకు సంబంధించిన బులిటెన్ విడుదల చేశారు. ఆదివారం నాడు […]

ఊపిరి పీల్చుకుంటున్న కేరళ.. ఆదివారం కేసులు నిల్.. అంతేకాదు..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 03, 2020 | 8:33 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. కేరళలో మాత్రం నెమ్మదిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు కేసులు ఓ రోజు పెరుగుతూ… మరో రోజు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. క్రమక్రమంగా కరోనా బారినుంచి కోలుకుని.. ఆస్పత్రుల నుంచి రోజుకు కొందరు డిశ్చార్జ్ అవుతుండటంతో కేరళ సర్కార్‌ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ క్రమంలో ఆదివారం కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి శైలజ కరోనా కేసులకు సంబంధించిన బులిటెన్ విడుదల చేశారు. ఆదివారం నాడు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేరళలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 95 అని తెలిపారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 401 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ప్రకటించింది.

కాగా.. ఆదివారం కేరళలో కొత్తగా మరో నాలుగు ప్రాంతాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. దీంతో..రాష్ట్ర వ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌ల సంఖ్య 84కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 21,720 మంది అబ్జర్వేషన్‌లో ఉన్నారని తెలపగా.. వీరిలో 388 మంది ఆసుపత్రుల్లో ఉన్నారని.. మిగతా వారు హోం క్వారంటైన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

Follow Us
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం