AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6,6,6.. ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్! 4 ఓవర్లో హాఫ్ సెంచరీ..

టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ గట్టి పోటీ ఇచ్చింది. 182 పరుగుల భారీ స్కోరు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు, 4 ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్నాడు. మొహమ్మద్ సిరాజ్‌ను కాదని ప్రసిద్ధ్‌ను ఎంపిక చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

6,6,6.. ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్! 4 ఓవర్లో హాఫ్ సెంచరీ..
Ind Vs Ire
SN Pasha
|

Updated on: Jun 26, 2026 | 8:35 PM

Share

ఐర్లాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా గట్టి షాకే తగిలింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్.. పాపం పసికూన ఐర్లాండ్, బలమైన టీమిండియా యంగ్ బ్లడ్ ముందు కనీసం నిలబడుతుందా? అని చాలా మంది అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా బ్యాటింగ్‌లో గట్టి పోటీ ఇచ్చింది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే.. ఐర్లాండ్ ఒక ఫైటింగ్ టార్గెట్ అయిన ఇస్తే బాగుంటుంది.. టీమిండియా బ్యాటర్ల బ్యాటింగ్ ఎంజాయ్ చేయొచ్చని క్రికెట్ అభిమానులు అనుకున్నారు.

కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తే ఐర్లాండ్ ఏకంగా 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఇందులో ఐర్లాండ్ బ్యాటర్లను ఎంత మెచ్చుకన్నా తప్పులేదు. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మరోవైపు టీమిండియా బౌలింగ్ ఎటాక్‌లో కొంతమంది బౌలర్లు రాణిస్తే.. కొంతమంది తేలిపోయారు. ఐర్లాండ్ వంటి పసికూన జట్టుపై పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ దారుణంగా విఫలం అయ్యాడు. తన 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. ఐర్లాండ్ 9 వికెట్లు కోల్పోయినా.. ప్రసిద్ధ్‌కు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా దక్కలేదు. పైగా ఒకే ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. ఐర్లాండ్ బ్యాటర్ గారెత్ డెలానీ వరుసగా మూడు సిక్సులతో అల్లాడించాడు. మొహమ్మద్ సిరాజ్ వంటి బౌలర్‌ను కాదని ఇతన్ని టీమ్‌లోకి తీసుకుంటే ఇలాగే ఉంటుందని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!