AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE: టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే..

IND vs IRE 1st T20: టీ20 లీగ్‌లో భాగంగా బెల్ఫాస్ట్‌లోని స్టార్మాంట్ క్రికెట్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్‌ ఊహించని షాక్ తగిలింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే ఐర్లాండ్ భారీ ట్వి్ట్ ఇచ్చింది. ఆరోవర్లు ముగిసే సరికే భారత్‌ 3 వికెట్లు కోల్పోయింది.

IND vs IRE: టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే..
Ind Vs Ire T20
Anand T
|

Updated on: Jun 26, 2026 | 8:52 PM

Share

ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ కేవలం 4 బంతుల్లో 1 ఫోర్‌తో 5 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఐర్లాండ్ తరపున ఆడుతున్న భారత్ సంతతికి చెందిన పేసర్ బౌలింగ్‌లో శాంసన్ అవుటయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ సైతం క్రీజులో ఎక్కవ సేపు నిలబడలేకపోయాడు. ఐర్లాండ్ బౌలర్ మ్యాత్యూవ్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి కేవలం 5 బంతుల్లో 1 రన్ మాత్రమే చేసి వెనుతిరిగాడు.

ఇక ఇషాన్ కిషన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. 7 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఐర్లాండ్ బౌలర్ మ్యాథ్యూ హాలార్డ్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. ఇక తొలుత ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ మాత్రం వికెట్‌లు పడుతున్నా.. తనదైన స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

కేవలం 19 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో తుఫాన్ హాఫ్ సెంచరీ చేసి భారత్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో భారత్ స్కోర్ 7.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 రన్స్ చేరుకుంది. అయితే ఇదే ఊపులో అభిషేక్ మ్యాచ్‌ను గెలిపిస్తాడనుకున్న ఫాన్స్ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. తర్వాతి ఓవర్లో మాత్యూవ్ హాలార్డ్ వేతిన బంతికి అభిషేక్ సైతం తన వికెట్ సమర్పించకొని వెనుతిరిగాడు. దీంతో భారత్ కేవలం 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
చిన్న సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీ విష్ణు
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం