AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చు!

మన శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం.ఇది ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అనేక ఇతర శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, ఇళ్లకే పరిమితం కావడం వల్ల చాలా మంది ఈ విటమిన్ లోపం కనిపిస్తోంది.ఈ విటమిన్ లోపం కేవలం ఎములపై మాత్రమే పడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది గుండె ఆరోగ్యంపై కూడ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది తాజాగా పరిశోధనలు చెబుతున్నాయి.

Health Tips: ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చు!
Vitamin D Deficiency And Heart Disease
Anand T
|

Updated on: Jun 26, 2026 | 8:23 PM

Share

నేటి బిజీ లైఫ్‌స్టైల్ వల్ల ఎక్కువ సమయం ఇళ్లు లేదా ఆఫీసులకే పరిమితం కావడం, ఎండ తగలకపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిలో విటమిన్ డి స్థాయిలు తగ్గిపోతున్నాయి. తరచుగా శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు లేదా రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే ఈ లోపం బయటపడుతుంది. అటువంటప్పుడు విటమిన్ డి లోపం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, శరీరంలో విటమిన్ డి సరైన స్థాయిలో ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం.

విటమిన్ డి లోపం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గడానికి, గుండె జబ్బుల ప్రమాదం పెరగడానికి మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. విటమిన్ డి శరీరంలోని గుండె, రక్తనాళాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన విధుల్లో పాల్గొంటుందని తద్వారా ఇది గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

అయితే, కేవలం విటమిన్ డి లోపం వల్లే గుండె జబ్బులు వస్తాయని ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు స్పష్టంగా నిరూపించలేదు. గుండె ఆరోగ్యం అనేది హై బ్లడ్ ప్రెజర్ (బిపి), డయాబెటిస్, ఊబకాయం, ధూమపానం, జీవనశైలి వంటి అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని.. అందుకే విటమిన్ డి లోపం ఉన్నప్పుడు వైద్యుల సలహా మేరకు పరీక్షలు, చికిత్స చేయించుకోవడం అవసరం వైద్యులు చెబుతున్నారు.

విటమిన్ డి లోపం లక్షణాలు

శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు మీకు తరచుగా అలసటగా అనిపించడం, కండరాల నొప్పులు లేదా బలహీనత, ఎముకల నొప్పులు, నడుము నొప్పి, రోగనిరోధక శక్తి తగ్గి అనారోగ్యానికి గురవ్వడం, మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది నడవడానికి కూడా ఇబ్బంది పడవచ్చు. అయితే, ఇది ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే అవసరమైతే వైద్యుల సలహాతో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

శరీరంలో విటమిన్ డి స్థాయిని ఎలా మెయింటేన్ చేయాలి

శరీరంలో విటమిన్ డి స్థాయిలను మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రతిరోజూ ఉదయం పూట కాసేపు లేత ఎండలో గడపాల్సి ఉంటుంది. దీని వల్ల మీకు సూర్యుడి నుంచి వచ్చే సహజమైన విటమిన్‌ డి లభిస్తుంది. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే కొవ్వు కలిగిన చేపలు , గుడ్డు సొన, ఫోర్టిఫైడ్ పాలు లేదా తృణధాన్యాలను తీసుకోవాలి. ఒకవేళ పరీక్షల్లో విటమిన్ డి లోపం ఉన్నట్లు తేలితే, డాక్టర్ సలహా మేరకు మాత్రమే సప్లిమెంట్లు తీసుకోండి. సొంతంగా లేదా ఎక్కువ మొత్తంలో విటమిన్ డి తీసుకోవడం కూడా శరీరానికి హాని కలిగిస్తుంది.

Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరిండం లేదు. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్