ఆరు రోజుల కవలలకు కరోనా.. అక్కడ అతి పిన్న వయస్కులు వారే..!

చిన్న, పెద్ద.. ధనిక, బీద తేడా లేకుండా.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ కరోనా భయపెట్టిస్తోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ వైరస్‌ విజృంభణను ఆపలేకపోతున్నారు.

ఆరు రోజుల కవలలకు కరోనా.. అక్కడ అతి పిన్న వయస్కులు వారే..!

Edited By:

Updated on: May 23, 2020 | 4:37 PM

చిన్న, పెద్ద.. ధనిక, బీద తేడా లేకుండా.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ కరోనా భయపెట్టిస్తోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ వైరస్‌ విజృంభణను ఆపలేకపోతున్నారు. మరోవైపు ఈ మహమ్మారిని అంతమొందించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలను ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా గుజరాత్‌లో ఆరు రోజుల కవలలకు కరోనా సోకింది.

మోలికూర్ గ్రామానికి చెందిన ఓ గర్భిణికి ఇటీవల కరోనా సోకగా.. ఆమె ఈ నెల 16న వాద్‌నగర్‌లో ఒక ఆడ బిడ్డ, ఒక మగ బిడ్డ జన్మనిచ్చింది. వీరికి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శుక్రవారం వైద్యులు తెలిపారు. గుజరాత్‌లో వైరస్ సోకిన అతి చిన్న వయస్కులు ఈ కవలేనని వారు వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కాగా ముంబయి నుంచి వచ్చిన ముగ్గురి ద్వారా మోలికూర్ గ్రామంలో కరోనా విజృంభణ మొదలైంది. ఇప్పుడు అక్కడ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read This Story Also: మళ్లీ అదే సమస్య‌.. ప్రభాస్‌ మూవీకే ఎందుకిలా..!