మళ్లీ అదే సమస్య‌.. ప్రభాస్‌ మూవీకే ఎందుకిలా..!

ప్రభాస్ మూవీకి మళ్లీ అదే సమస్య ఎదురైంది. 'సాహో' సమయంలో టీమ్‌ ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారో, ఇప్పుడు అదే ఇబ్బందిని ప్రభాస్ 20వ మూవీ యూనిట్ ఎదుర్కొంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

మళ్లీ అదే సమస్య‌.. ప్రభాస్‌ మూవీకే ఎందుకిలా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 23, 2020 | 6:20 PM

ప్రభాస్ మూవీకి మళ్లీ అదే సమస్య ఎదురైంది. ‘సాహో’ సమయంలో టీమ్‌ ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారో, ఇప్పుడు అదే ఇబ్బందిని ప్రభాస్ 20వ మూవీ యూనిట్ ఎదుర్కొంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్ తప్పుకున్నారట. ఇప్పటికే ఈ మూవీ కోసం రెండు, మూడు పాటలను కంపోజ్ చేసిన ఆయన క్రియేటివ్ డిఫరెన్స్‌లతో తప్పుకున్నట్లు టాక్.

కాగా ప్రభాస్ 20వ చిత్రాన్ని 2018లో అనౌన్స్‌ చేశారు. ఆ ఏడాదిలోనే షూటింగ్‌ కూడా ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేసింది. కానీ ఇంతవరకు సంగీత దర్శకుడిని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ‘సైరా’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాతీయ అవార్డు గ్రహీత అమిత్‌ త్రివేది ప్రభాస్ మూవీకి సంగీతం అందించబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల నుంచి తెలిసింది. ఇక ఇప్పుడు ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో సంగీత దర్శకుడి కోసం మూవీ యూనిట్ ఇప్పుడు వెతుకులాట ప్రారంభించినట్లు టాక్.

అయితే ప్రభాస్‌ ముందు చిత్రం సాహో విషయంలోనూ ఇదే జరిగింది. ఈ మూవీకి బాలీవుడ్ త్రయం శంకర్- ఇషాన్- లాయ్‌లు సంగీతం అందించబోతున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. కాగా సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న సమయంలో ఈ మూవీ నుంచి ఆ ముగ్గురు తప్పుకున్నారు. కొన్ని కారణాల వలన ప్రభాస్ మూవీ నుంచి బయటకు వచ్చినట్లు శంకర్ మహదేవన్ ట్విట్టర్‌లో తెలిపారు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డ టీమ్.. పలువురు సంగీత దర్శకులతో ఆ సినిమాకు పాటలను చేయించుకుంది. అవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి అది వేరే విషయం. ఇక ఇప్పుడు ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీకి అలానే జరుగుతుండటంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన నటుడి హీరోకే ఎందుకిలా అంటూ వారు వర్రీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? ప్రభాస్ 20వ చిత్రం నుంచి అమిత్ త్రివేది తప్పుకున్నాడా..? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. భాను శ్రీ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read This Story Also: నాగబాబు ట్వీట్లపై ఘాటుగా స్పందించిన పవన్‌.. ఆ వ్యాఖ్యలతో..!

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..