AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కరోనా‌’ జన్యుక్రమంలో మార్పులు.. పుట్టుకొచ్చిన మరో కొత్త రకం వైరస్‌

కోవిడ్‌ కారక 'సార్స్‌ కోవ్‌ 2' వైరస్‌ జన్యు క్రమంలో మార్పు జరిగిందని, దీంతో డీ614జీ అనే కొత్త రకం వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

'కరోనా‌' జన్యుక్రమంలో మార్పులు.. పుట్టుకొచ్చిన మరో కొత్త రకం వైరస్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 04, 2020 | 9:13 AM

Share

కోవిడ్‌ కారక ‘సార్స్‌ కోవ్‌ 2’ వైరస్‌ జన్యు క్రమంలో మార్పు జరిగిందని, దీంతో డీ614జీ అనే కొత్త రకం వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కొత్త వైరస్‌ వలన మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం పెరిగిందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్న వైరస్‌ రకాల్లో ఈ కొత్త రకం ఎక్కువ ఎఫెక్ట్‌ చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రయోగశాలల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఈ వైరస్‌కి సంక్రమణ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని వారు అన్నారు.

డీ614జీ వైరస్‌ గురించి ఏప్రిల్‌ మొదటివారంలో మాకు తెలిసింది. స్థానిక రకం కరోనా వైరస్‌లు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో డీ614జీ రకం ప్రవేశంతో పరిస్థితి తారుమారు అవుతోంది. ఇప్పుడున్న వైరస్‌ రకాల్లో డీ614జీ ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది అని బెటె కోర్బర్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. ఈ రకం వైరస్‌లో చాలా స్వల్పమైన మార్పు ఉందని, అది చాలా సమర్థమైందని ఆయన పేర్కొన్నారు. మానవ కణాల్లోకి ప్రవేశించేందుకు దోహదపడుతున్న స్పైక్‌ ప్రొటీన్‌ డీ614జీలో ప్రభావవంతంగా మార్పు చెందడమే దీనికి కారణమని చెప్పారు. శ్వాసకోశ వ్యవస్థ పైభాగంలో ఈ వైరస్‌ భారీ స్థాయిలో ఉంటుందని.. దీని వల్ల ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ వైరస్‌కి సంబంధించి మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Follow Us
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!