ఇద్దరు బాస్కెట్ బాల్ ప్లేయర్స్‌కి కరోనా పాజిటివ్..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, వైద్యులు, పోలీసులు, సినీ నటులు, క్రికెట్ ప్లేయర్స్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు బాస్కెట్ బాల్ ప్లేయర్స్‌కి కరోనా సోకినట్టు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, వైద్యులు, పోలీసులు, సినీ నటులు, క్రికెట్ ప్లేయర్స్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు బాస్కెట్ బాల్ ప్లేయర్స్‌కి కరోనా సోకినట్టు.. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (NBI) మంగళవారం వెల్లడించింది. ఎన్‌బీఐ క్యాంపస్‌లో 322 మంది క్రీడాకారులకు పరీక్షలు చేయగా వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలిందని పేర్కొంది. ఇద్దరు క్రీడాకారులకు కరోనా సోకడంతో వారిని హోం క్వారంటైన్‌కు తరలించింది ఎన్‌బీఏ. అలాగే 2019-20 సీజన్‌లో జరిగే బాస్కెట్ బాల్ పోటీలను జులై 30వ తేదీ నుంచి ప్రారంభించాలని నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రకటించింది.
బాస్కెట్ బాల్ ప్లేయర్ రస్సెల్ వెస్ట్ బ్రూక్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు. ‘నాకు కరోనా పాజిటివ్ అని రావడంతో స్వీయ నిర్భందంలో ఉన్నాను. ప్రస్తుతం తాను క్షేమంగా క్వారంటైన్‌లో ఉన్నాని, త్వరగానే కోలుకుంటున్నానని రస్సెల్ చెప్పారు. అలాగే ఎవరికీ కరోనా వైరస్ సోకకుండా ఇంట్లోనే క్షేమంగా ఉండాలని, మాస్క్ ధరించాలని రస్సెల్ అభిమానులకు’ సూచించారు.



