కరోనాపై ఆర్‌ఎస్‌ఎస్‌ పోరు.. ముస్లీం మహిళ విరాళం.. ఇంతకు ఆ మహిళ ఎవరో తెలుసా..?

| Edited By:

Mar 31, 2020 | 8:41 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనాతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు.. సామాన్య ప్రజానీకానికి సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ కూడా వారి వారి సేవా సంస్థల ద్వారా సేవలందిస్తోంది. అయితే వీరి సేవలో పాలుపంచుకునేందుకు.. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ తన వంతు సహాయంగా రూ.5 లక్షల విరాళం ఇచ్చింది. రాష్ట్రానికి చెందిన ఖలీదా బేగం అనే 87 […]

కరోనాపై ఆర్‌ఎస్‌ఎస్‌ పోరు.. ముస్లీం మహిళ విరాళం.. ఇంతకు ఆ మహిళ ఎవరో తెలుసా..?
Follow us on

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనాతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు.. సామాన్య ప్రజానీకానికి సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ కూడా వారి వారి సేవా సంస్థల ద్వారా సేవలందిస్తోంది. అయితే వీరి సేవలో పాలుపంచుకునేందుకు.. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ తన వంతు సహాయంగా రూ.5 లక్షల విరాళం ఇచ్చింది. రాష్ట్రానికి చెందిన ఖలీదా బేగం అనే 87 ఏళ్ల మహిళ.. ఈ ఏడాది మక్కా వెళ్లేందుకు కొంత ధనాన్ని దాచుకుంది. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మక్కాకు కూడా ఎవర్నీ రానివ్వడం లేదు. ఇటు దేశ వ్యాప్తంగా కూడా లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు సేవా భారతి తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న సేవా కార్యక్రమాల్ని చూసి.. వారికి తన వంతు సాయాన్ని అందించాలని నిశ్చయించుకుంది. దీంతో ఆమె దాచుకున్న రూ.5లక్షల రూపాయలను సేవా భారతికి అందజేసింది. అయితే ఆ 87 ఏళ్ల ముస్లిం మహిళ ఎవరన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ మీడియా విభాగం తెలిపింది. ఒకప్పటి జన సంఘ్ నాయకుడు.. కల్నల్‌ పీర్‌ మహ్మద్‌ ఖాన్‌ కోడలని పేర్కొంది.