తెలంగాణ ప్రభుత్వానికి.. ‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం

| Edited By:

Apr 08, 2020 | 6:45 PM

బుల్లితెర చరిత్రలో 'మొగలి రేకులు' సీరియల్ ఓ సన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటివరకూ వచ్చిన టీవీ సీరియల్స్‌ స్టైల్‌ని మార్చేసి.. ట్రెండ్ క్రియేట్ చేసింది. సినిమాలకు తీసిపోకుండా ఆసక్తికర స్టోరీతో ఈ సీరియల్‌ని నడిపించారు డైరెక్టర్ మంజులా నాయుడు. ఇందులో ఆర్కే నాయుడుగా, మున్నాగా ప్రధాన పాత్ర పోషించి..

తెలంగాణ ప్రభుత్వానికి.. మొగలి రేకులు ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం
Follow us on

బుల్లితెర చరిత్రలో ‘మొగలి రేకులు’ సీరియల్ ఓ సన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటివరకూ వచ్చిన టీవీ సీరియల్స్‌ స్టైల్‌ని మార్చేసి.. ట్రెండ్ క్రియేట్ చేసింది. సినిమాలకు తీసిపోకుండా ఆసక్తికర స్టోరీతో ఈ సీరియల్‌ని నడిపించారు డైరెక్టర్ మంజులా నాయుడు. ఇందులో ఆర్కే నాయుడుగా, మున్నాగా ప్రధాన పాత్ర పోషించి.. కోట్ల మంది అభిమానాన్ని పొందాడు నటుడు సాగర్. ఈ ఒక్క సీరియల్‌తోనే సాగర్‌కు మంచి పేరొచ్చింది. పోలీస్ ఆఫీసర్‌గా, ఓ ప్రేమికుడిగా రెండు పాత్రలను ఎంతో హుందాగా పోషించాడు. అలాగే ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నారు సాగర్.

కాగా మొగలి రేకులు సీరియల్ తర్వాత సాగర్ సినిమాల వైపు వెళ్లాడు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా నటించాడు. ఆ తరువాత ఓ సినిమాలో హీరోగా నటించినా అది సక్సెస్ అవ్వకపోయే సరికి.. బిజినెస్‌లో బిజీ అయిపోయాడు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ కారణంగా దేశంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పేద ప్రజల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వానికి తన వంతు సాయం అందించాడు సాగర్. సీఎం రిలీఫ్ ఫండ్‌‌కి రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. తానే స్వయంగా మంత్రి కేటీఆర్‌కు చెక్‌ను అందజేశారు. కాగా ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ స్వస్థలం గోదావరి ఖని. 2017లో సాగర్‌కి సౌందర్యతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు వివిన్ సంతానం.

ఇవి కూడా చదవండి: 

ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్

హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’

తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం

అరుదైన ఘనత సాధించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి..

హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే

రెహమాన్‌కు బ్రేక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మృతి

‘పాలు’ తాగాడని కన్న కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి