Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌లో ‘శానిటైజర్ గొడుగు’… ఐడియా అదుర్స్

ఏపీలో విద్యార్థులు, టీచర్లు కరోనా బారినపడుతుండటం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశాడు. విద్యార్థుల కోసం సరికొత్తగా శానిటైజర్ గొడుగును తయారు చేశాడు. ఎమ్మెల్యే రోజా స్వయంగా పరిశీలించారు..

స్కూల్‌లో ‘శానిటైజర్ గొడుగు’... ఐడియా అదుర్స్
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 06, 2020 | 4:49 PM

ఏపీలో స్కూళ్లు తిరిగి తెరుచుకున్న క్రమంలో విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు హాజరవుతున్నారు.. తల్లిదండ్రుల అంగీకార పత్రంతో విద్యార్థులు వస్తున్నారు..కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థులు, టీచర్లు కరోనా బారినపడుతుండటం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశాడు. విద్యార్థుల కోసం సరికొత్తగా శానిటైజర్ గొడుగును తయారు చేశారు.

చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం తడుకు జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న భానుప్రసాద్ శానిటైజర్ గొడుగును తయారు చేశారు. కేవలం 2300 రూపాయల ఆయుర్వేద మూలికలతో శానిటైజర్ గొడుగును తయారు చేశారు. ఇందులో UPS, టైలర్ ఫెడల్, బూస్టర్ పంప్, ఫుట్ వాల్, మూలికల ద్రవంతో పెద్ద గొడుగును తయారు చేశాడు. ఈ పరికరాన్ని స్కూల్ ఆవరణలో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఎమ్మెల్యే రోజా చేతుల మీదుగా శానిటైజర్ గొడుగును ఆవిష్కరించారు. గొడుగు స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే రోజా మాస్టర్‌ను అభినందించారు.

నిమ్మ, వేప, వంటి ఆయుర్వేద మూలికలతో తయారుచేసిన ద్రవం వాడడం వల్ల విద్యార్థులకు ఎలాంటి హాని ఉండదన్నారు. తలకు హెల్మెట్ లాంటి మాస్క్ వేసుకొని స్ప్రే చేయడం వల్ల శరీరానికి రక్షణ కలుగుతుందన్నారు. స్కూల్ ఎంట్రెన్స్ వద్ద ఈ స్ప్రే ను అమర్చి.. స్కూల్‌లోకి వచ్చే విద్యార్థులు స్ప్రే చేసుకుని సామాజిక దూరం పాటించటం వల్ల రోజంతా రక్షణ తో ఉంటారని టీచర్ భాను ప్రసాద్ చెబుతున్నారు. పైగా, శానిటైజర్ గొడుగు ను పాఠశాలలో ఉపయోగించడం వల్ల విద్యార్థుల హాజరు శాతం పెరిగిందన్నారు.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!