వారికి డబ్బులిచ్చి క్యూలైన్‌లో నిలబెట్టేది చంద్రబాబే…

టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలకు డబ్బులిచ్చి వైన్ షాపులకు చంద్రబాబు పంపించి గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచామన్న ఆయన.. ఈ విషయాన్ని చంద్రబాబు కావాలని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ షాపుల లైన్‌లోకి టీడీపీ కార్యకర్తలను పంపి తన వర్గం మీడియాతో క్షుద్ర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మద్యం షాపులు […]

వారికి డబ్బులిచ్చి క్యూలైన్‌లో నిలబెట్టేది చంద్రబాబే...

Edited By:

Updated on: May 06, 2020 | 4:21 PM

టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలకు డబ్బులిచ్చి వైన్ షాపులకు చంద్రబాబు పంపించి గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచామన్న ఆయన.. ఈ విషయాన్ని చంద్రబాబు కావాలని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

లిక్కర్ షాపుల లైన్‌లోకి టీడీపీ కార్యకర్తలను పంపి తన వర్గం మీడియాతో క్షుద్ర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మద్యం షాపులు ప్రధాని తెరవమని చెప్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో మోదీని తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కేసులకు భయపడి ప్రేమ సందేశాలు పంపిస్తున్నరంటూ ఎద్దేవా చేశారు.