Fact Check: ఉచితంగా ఒమిక్రాన్‌ నిర్ధారణ పరీక్ష.. కేంద్ర హోం శాఖ ఏం చెబుతోందంటే..

|

Jan 01, 2022 | 8:37 AM

అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు సైబర్‌ నేరగాళ్లు. ఓవైపు దేశ ప్రజలంతా ఒమిక్రాన్‌ భయంతో ఆందోళన చెందుతుంటే.. కొంతమంది కేటుగాళ్లు మాత్రం దీనిని ఆసరాగా మార్చుకుంటున్నారు

Fact Check: ఉచితంగా ఒమిక్రాన్‌ నిర్ధారణ పరీక్ష.. కేంద్ర హోం శాఖ ఏం చెబుతోందంటే..
Follow us on

అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు సైబర్‌ నేరగాళ్లు. ఓవైపు దేశ ప్రజలంతా ఒమిక్రాన్‌ భయంతో ఆందోళన చెందుతుంటే.. కొంతమంది కేటుగాళ్లు మాత్రం దీనినే ఆసరాగా మార్చుకుంటున్నారు. ఈ కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించడానికి ఉచిత నిర్ధారణ పరీక్షలు చేయిస్తామంటూ ఈ- మెయిల్స్‌ పంపుతూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నాళ్లుగా.. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ తరహా నేరాలు ఎక్కువయ్యాయి. దీనిని గుర్తించిన కేంద్ర హోం శాఖ సైబర్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఎలాంటి నిజం లేదని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

‘ కొందరు కేటుగాళ్లు గత కొన్ని రోజులుగా ఒమిక్రాన్‌ పేరుతో పలు మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త వేరియంట్ నిర్ధారణ కోసం ఉచిత పరీక్షలు చేస్తామంటూ హానికరమైన లింక్స్‌, ఫైల్స్‌తో ఈ- మెయిల్స్ పంపుతున్నారు. జనాలను నమ్మించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య సంస్థల పేర్లనూ వాడుకుంటున్నారు. ఈ లింక్‌లను క్లిక్‌ చేయగానే మనల్ని నకిలీ వెబ్‌సైట్లకు మళ్లించి మన వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. వాటితో సైబర్‌, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వెబ్‌సైట్ల ప్రామాణికతను చెక్‌ చేసుకోవాలని, URL లను పరిశీలించాలి. ఈ తరహా మోసాలు, నేరాలపై cybercrime. gov. in కు సమాచారం అందివ్వాలి’ అని కోరింది.

Also Read:

Fact Check: వాట్సప్‌లో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. అసలు విషయమేమిటంటే..

Online shopping: ఖరీదైన ఐఫోన్‌ ఆర్డర్‌ చేశాడు..  వచ్చిన పార్శిల్‌ను చూసి కంగుతిన్నాడు..

Vaccination: ఈరోజు నుంచే 15 నుంచి 18 ఏళ్ల లోపు టీనేజర్లకు కూడా కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. ఎలా నమోదు చేసుకోవాలంటే..