Allu Aravind on Covid Vaccine: ‘టీకా తీసుకోవడం వల్లనే నేను సేఫ్’.. అంటూ.. వ్యాక్సిన్ పని తీరుపై స్పందించిన అల్లు అరవింద్..

|

Apr 05, 2021 | 3:51 PM

చాలా మందిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం పై అనేక సందేశాలు పెరిగిపోయాయి. పలువురు అనుమానం టీకా పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ స్పందించారు....

Allu Aravind on Covid Vaccine: టీకా తీసుకోవడం వల్లనే నేను సేఫ్.. అంటూ.. వ్యాక్సిన్ పని తీరుపై స్పందించిన అల్లు అరవింద్..
Allu Aravind
Follow us on

Allu Aravind on Corona Vaccine:: ప్రస్తుతం రోజు రోజుకీ కరోనా కేసుల నమోదు పెరుగుతున్న నేపథ్యంలో .. చాలా మందిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం పై అనేక సందేశాలు పెరిగిపోయాయి. పలువురు అనుమానం టీకా పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ స్పందించారు.

తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినా తర్వాత కూడా ఎటువంటి కరోనా లక్షణాలు లేవని అరవింద్ చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత తన స్నేహితులతో కలిసి ఒక ఊరు వెళ్లమని చెప్పారు. మా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే మా ముగ్గురిలో ఇద్దరం చాలా సేఫ్ గా ఉన్నాం.. ఒకరు మాత్రం హాస్పటల్ లో అడ్మిట్ అయ్యారు. ఎందుకంటే మేమిద్దరం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడంతో.. ఈ వైరస్ ప్రభావం ఏ విధంగానూ మాపై ప్రభావం చూపలేదని చెప్పారు అరవింద్.. అంతేకాదు.. తన స్నేహితుడు కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో.. ప్రస్తుతం హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారని …  కనుక వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా వస్తుంది అనేది అపోహ.. అలా వచ్చినా ఎటువంటి ప్రభావం చూపకుండా మనం సేఫ్ గా ఉంటామని చెప్పడానికి నేనే ఉదాహరణ అని చెప్పారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని.. తద్వారా క్షేమంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికే వైద్య నిపుణులు కరోనా వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయని.. అందువల్ల కరోనా వైరస్ సోకినా దాని ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్పారు. అందుకని అందరూ టీకా పై ఎటువంటి అనుమానం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు. తద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. మన ద్వారా ఇతరులకు కరోనా సోకకుండా కాపాడినవాళ్లం అవుతామని సూచిస్తున్నారు.

 

Aslo Read: అక్కడ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి బంపర్ ఆఫర్… మహిళలకు ముక్కుపుడక గిఫ్ట్

హిందువుల పూజ్యనీయ మొక్క తులసి పెరుగుదల ఆ ఇంటి వైభవానికి చిహ్నమా.. అకస్మాత్తుగా ఎండిపోతే..!